Chelluboyina Srinivasa Venugopalakrishna : ప్రజలను వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 14. రాజవోలులో రచ్చబండ. కల్తీ మద్యం పై కోటి సంతకాల ఉద్యమం రాజమండ్రి రూరల్, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురిచేసిన కూటమి ప్రభుత్వ పాలకుల ను తూర్పుర పట్టాలని, ప్రజలకు జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు ఆధ్వర్యంలో మంగళవారం రాజవోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యంపై కోటి, సంతకాల సేకరణ, కార్యక్రమం జరిగింది.

ఈ సమావేశానికి, ముఖ్య అతిథులుగా,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, అధ్యక్షులు మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ, నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే పాలన సాగిస్తోందని ముఖ్యఅతిథిగా హాజరైన చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంతా పాలకుల దుర్నీతిని, అక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలి అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, జిల్లా అధికారి ప్రతినిధి పై యాల రాజేష్ ఆరోపించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

coalition government that deceived the people

You cannot copy content of this page

Scroll to Top