Agreement with Google : గూగుల్ తో ఒప్పందం

TRINETHRAM NEWS

తేదీ : 14/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి; విశాఖపట్నంలో ఒకటి గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా. చంద్రబాబు నాయుడు, ఐటీ , విద్యాశాఖ మంత్రి లోకేష్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి గాంధీ పలికారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని. శివనాథ్ (చిన్ని) అన్నారు. ఢిల్లీలో ఒప్పందం చేసుకుని, ఉండవల్లి వాళ్ల నివాసం వద్ద శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణతో కలిసి శివనాథ్ పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. విశాఖను ఏఒకటి సిటిగా తీర్చిదిద్దబోతున్నటువంటి చంద్రబాబు, లోకేష్ కు అభినందనలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థ సుమారు పది హేను బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టబడి పెట్టనుందని ఎంపీ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగవంశం, సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబో తు. రామారావు , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Agreement with Google

You cannot copy content of this page

Scroll to Top