MLA Gorantla : విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వమే

TRINETHRAM NEWS

కొంతమూరు గ్రామంలో జెడ్.పి హైస్కూల్ నందు సరస్వతి దేవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్ ఆగష్టు 21: త్రినేత్రం న్యూస్. విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చి, కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం ఉదయం కొంతమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శ్రీ సరస్వతి దేవి విగ్రహాన్ని జి.మేడపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సరస్వతి దేవి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విద్య అనేది అందరికీ అవసరమైందని, ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రైవేటు రంగాల వారు కూడా ముందుకు రావాలని, దాతల సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహావిష్కరణ చాలా సంతోష దాయకమని అన్నారు. విద్య శాఖ మాత్యులు నారా లోకేష్, సారథ్యంలో విద్యాశాఖ అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందని. విద్యార్థులకు అందించిన పుస్తకాలు. యూనిఫామ్ లు, బ్యాగ్స్, బూట్లు మంచి నాణ్యతతో కూడుకున్నవి అందించారని, వాటితో పాటు తల్లికి వందనం కూడా అమలు చేశారని, మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో కూడిన మంచి ఆహారాన్ని అందిస్తున్నారని, ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని తెలిపారు.

విద్యార్థులు విద్యార్థి దశ నుండే చదువుతోపాటు, ఆటలు, పాటలు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా మంచి అలవాట్లను నేర్చుకోవాలని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత దిశగా మనమందరం ముందుకు వెళ్లాలన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని అన్నారు. పాఠశాల నందు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాతలకు, లైన్స్ క్లబ్ వారికి, పాఠశాల పేరెంట్స్ కమిటీ నీ ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను, నున్న కృష్ణ, ఉండవల్లి బంగార్రాజు, తాడేపల్లి నాగరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ అంగర రాజు, దండమూడి తేజ, సయ్యద్ ఉమర్, షేక్ ఖాసిం, మోహనరావు, బిజెపి మండల అధ్యక్షులు నాగల శివ కుమార్, దండమూడి శ్రీహరి, వీరబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు ముళ్ళపూడి రామ సుబ్బారావు, చిట్నీడి శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ, మాధవి, చిన్న, పాఠశాల విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

coalition government has brought many new reforms for students

You cannot copy content of this page

Scroll to Top