AITUC : పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వO

TRINETHRAM NEWS

AITUC సహాయ కార్యదర్శి
నూనె వెంకటేశ్వర్లు,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనుద్దీన్ .

డిండి (గుండ్ల పల్లి) జులై 09 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వo అవ ళంబిస్తున్న ,కార్మిక, ప్రజా, రైతాంగ ,వ్యతిరేక విధానాలను రద్దు చేసుకోవాలని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 18 గంటల కార్మికుల పనిని తగ్గించాలని 8 గంటల పని కావాలని ఆనాడు యజమాన్యంతో పోరాడి, 44 కార్మిక చట్టాలలోని 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించి 4 కోడ్స్ గా విభజించి అమలు జరుపాలని , చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, స్కీO వర్కర్లకు ,అంగన్వాడి ,ఆశ ,మధ్యాహ్న భోజనం ,గ్రామపంచాయతీ ,మెడికల్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కనిసవేతనం 26000రూపాయలు నిర్ణయించి అమలుపరచాలని , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు PF, ESI, సౌకర్యం కల్పించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు ఇన్సూరెన్స కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం తీసుకున్నారని వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మండిపడ్డారు.

ప్రతి కార్మికునికి నెలకు 5 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని, కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు.తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనకచారి, సహాయ కార్యదర్శి బో ల్లె శైలేష్, AITUC మండల అధ్యక్షులు బుష్పాక లింగమయ్య, గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రామావత్ జవహర్ లాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎలిమినేటి దేవయ్య, AIYF జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, ప్రేమయ్య తదిరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The central government is

You cannot copy content of this page

Scroll to Top