AITUC : కార్మికుల శ్రమకు తగిన వేతనం మంజూరు కై పోరాటానికి సిద్ధం కండి

TRINETHRAM NEWS

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

139 వ. మేడే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలోఘనంగా….

త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,01: కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు గురువారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమయ్యే అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శితోకల ప్రసాద్ తెలియజేశారు. కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్ వద్ద ఏఐటియుసి నగర కార్యదర్శి టి .అన్నవరం అధ్యక్షతన భవన నిర్మాణ కార్మిక సంఘాలు, మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలుఘనంగా జరిగింది.ఏఐటీయూసీ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆవిష్కరణ చేశారు. ఎస్. అచ్యుతాపురం అంబేద్కర్ స్టాచ్యువద్ద న్యాయవాది టీ. ముసలయ్య (ముఖేష్) కార్మికుల జండాను ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.స్వామి బాబు, కే.మోహన్ రావు ల ఆధ్వర్యంలో జరిగిన మేడే ఆవిష్కరణ జెండాను ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కీర్ల కృష్ణారావు ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, మరియు ఎంప్లాయిస్ సెక్యూరిటీ గార్డ్ వర్కస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు: రామయ్య, అనిల్, ఆధ్వర్యంలో జరిగిన జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆవిష్కరణ చేశారు.

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు: బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన జెండాను ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లకృష్ణారావు ఆవిష్కరణ చేశారు. ఏపీఎస్పీ రాయుడు పాలెంలో ది. కాకినాడ జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణను ఏఐటియుసి నగర కార్యదర్శి టి. అన్నవరం ఆవిష్కరణ చేశారు. శారదా దేవి గుడి వద్దనున్న ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ శేఖర్ అధ్యక్షతన జరిగిన జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనాలు 35 వేల రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికుల శ్రమకు తగిన ఫలితంగా వేతనం మంజూరు కై కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాడితే పోయేదేమీ లేదని బానిస సంకెళ్ల తప్పని వారు పిలుపునిచ్చారు.

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ప్రారంభమై ఆనందభారతి గ్రౌండ్, రామకృష్ణారావు పేట, హీరో హోండా షోరూం, మెయిన్ రోడ్, ఎల్ఐసి, కల్పనా సెంటర్ మీదుగా కార్యాలయం వరకు భారీ ప్రదర్శన జరిగింది. ఏఐటియుసి ఆధ్వర్యంలో నడకుదురు, తిమ్మాపురం, వాకలపూడీ, జన చైతన్య లేఔట్, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లో జండా ఆవిష్కరణ ఘనంగా జరిగాయని ప్రసాద్ అన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం అన్నిచోట్ల మేడే కేకులను కట్ చేస్తూ కార్మికులకు తినిపిస్తూ స్వీట్లు పంపిణీ చేసుకోవడం ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు రాజేష్, బొబ్బిలి సత్యనారాయణ, వనచర్ల వీరభద్రరావు ,ఈశ్వరరావు, శ్రీను, జన పల్లి అప్పన్న, సత్యనారాయణ, మధు, జాన్ బాబు, శంకర్, కుమార్, ఏసు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Get ready to fight

You cannot copy content of this page

Scroll to Top