విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానిది సవతి తల్లిప్రేమ.
ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు కాంపెల్లి కళ్యాణ్., దిండి మండల కార్యదర్శి ఆర్కపల్లి మహేష్.
డిండి(గుండ్లపల్లి)జులై23 త్రినేత్రంన్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ విజయవంతం అయ్యిందని కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే విద్యారంగంపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నదని కీలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యనమల్ల నవీన్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) డివిజన్ అధ్యక్షులు సురికి వినయ్ కుమార్ లు ఆరోపించారు.
బంద్ సందర్భంగా డిండి మండలంలో మరియు అన్ని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థుల తరగతులను బహిష్కరించి నినాదాలు చేస్తూ బంద్ ను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


