Alliance Government : ఎన్నికల హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం (తెదేపా జనసేన బిజెపి) రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలి పౌరసంక్షేమసంఘం

TRINETHRAM NEWS

ఎన్నికల హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం (తెదేపా జనసేన బిజెపి) రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలి పౌరసంక్షేమసంఘం

Trinethram News : ఏపి కి రూ.9.75లక్షల కోట్ల అప్పులున్న విషయం కూటమి ప్రభుత్వానికి (తెదేపా జనసేన బిజెపి పార్టీల ఎమ్మెల్యే ఎంపి లకు) గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలియని విషయం కాదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్నికలకు ముందు రాబోయే అయిదేళ్ళ కాలానికి పదిలక్షల కోట్ల విలువ జేసే పలు పథకాల హామీలు ఇచ్చి వాటిని ఇప్పుడు నెరవేర్చలేమ ని చేతులు ఎత్తేయడం దగాకోరుతనంగా వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరడం గౌరవప్రదంగా వుంటుందన్నారు. గడచిన 8నెలల కాలంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు వంద నుండి నూట ఏభై శాతం పెరిగాయన్నారు. కరెంటు చార్జీల భారాలు ఎక్కువయ్యా యన్నారు.

డి ఎస్ సి నిర్వహణ అరుంధతి నక్షత్రంగా వుందన్నారు. సచివాలయం వాలంటీర్లు రెండు లక్షల ఏభై వేల మంది రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన లక్షా ఇరవై ఐదు వేల మంది నిరు ద్యోగులయ్యారన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు నెలల తరబడి బకాయిలతో జీతాలు అందడం లేదన్నారు. ఆశా వర్కర్లకు అంగన్ వాడీలకు మిడ్ డే మీల్స్ కార్మికుల హామీలు నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సిపీసి జీపీసి సమీక్ష లేకుండా ఐ ఆర్, పి ఆర్ సి, డి ఎ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ఆగిపోవడం వలన మధ్యతరగతి సామాన్యులకు విద్య వైద్యం ఆర్థిక సహాయం ఉపాధి కరువయ్య్యింద న్నారు. స్కూల్ ఫీజులు చెల్లించలేని ఇబ్బందు ల్లో పేరెంట్స్ తల్లడిల్లు తున్నారన్నారు. వైద్య విద్యను ప్రయివేటు పరం చేయడం వలన సామాన్యులకు వైద్య విద్య సీట్లు దక్కడం లేదన్నారు. నగరాలు పట్టణాల్లో ఇంటి పన్నుల భారం మరింత ఎక్కువయ్యిందన్నారు.

మార్కెట్ విభజనతో భూమి ధర రిజిస్ట్రేషన్ రేట్లు భారీగా పెంచడం వలన భారం ఎక్కువ కానుంద న్నారు. రోజుకు మూడు సార్లు చెత్తలు తరలించే పనులు జరగడం లేద న్నారు. రోడ్లుడ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి గుళ్ళల్లో అరచేతి ప్రసాదం చందంగా వుందన్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. మద్యందుకాణాల వద్ద ఓపెన్ బార్ తరహాగా విచ్చలవిడిగా తాగిస్తు న్నారన్నారు. పేకాట క్లబ్ లు గుండాటలు జూదాలు కోడి పందాలు వంటివి వీలున్న చోట నిత్యం జరిగే క్రీడలుగా తయారు కాబడ్డాయ న్నారు. బెనిఫిట్ షో లు పేరిట పేదల డబ్బును దోచిపెడుతున్నారన్నా రు. పి4 ప్రణాళిక పేరిట విజన్ 2047 డ్రోన్ కెమెరాల తెర చూపిస్తూ పబ్బం గడుపుతున్న ఎపి ప్రభుత్వ తీరు వలన దావోస్ పర్యటనలో ప్రపంచ పారిశ్రామిక వేత్తలు సైతం ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు.

5ఎత్తి పోతల పథకాలతో నిర్మిస్తున్న అమరావతి ప్రపంచ స్థాయిలో 8వ వింతగా సంపూర్ణఅప్పుల రాజధానిగా నిలిచి పోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయమన్న ప్రభుత్వ ప్రకటన లేకుండా ప్యాకేజీ డొల్ల వలన ఎటువంటి భరోసా లేదన్నారు. పోలవరం నిర్వాసితుల వెతలు తీర్చని పనుల వలన అరచేతి వైకుంఠంగా ప్రకటనలకే పరిమితం అవుతున్నదన్నారు. ఒక పక్క డబ్బులు లేవంటూనే ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంకు హడ్కో రుణాలు తేవడం నిస్సిగ్గుగా వుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న కూటమి పార్టీలు తెదేపా జనసేన గ్రాంట్లు తీసుకువచ్చే ధోరణి ప్రత్యేక హోదా సాధించే ప్రగతి లేకపోవడం వలన ప్రజల్లో ఎన్నికల నాటి అభిమానం పూర్తిగా కొల్పోయింద న్నారు. ప్రకటించిన ఎన్నికల హామీలు అమలు చేయకుంటే వేసవి ఎండల నుండి అన్ని వర్గాల ప్రజలు నిరుద్యోగులు రైతులు కార్మికులు ఉద్యోగులు శ్రామికులు మహిళలు పేదలు ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలు రోడ్డెక్కి నిరసించే సునామీ ప్రవాహం తప్పదన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top