Trinethram News రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ… సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల బ్యాక్గ్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21తో ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగిం చబోమని ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ స్పష్టం చేసింది.
గడువు ప్రకారం మే ఆఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలో 637 పాఠ శాలల్లో ఐదో తరగతిలో 51,408 సీట్లు, బ్యాక్లాగ్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
భర్తీ కోసం గత ఏడాది డిసెం బరు 11 నుంచి ఎస్సీ గురుకులు సొసైటీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22న అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. మార్చిలో ఫలితాలు వెల్లడించనుంది. అనం తరం ప్రవేశపరీక్షలో మార్కులు, విద్యార్థులు ఎంపిక చేసిన ఆప్షన్ల ప్రకారం ఆన్లైన్లో సీట్లు కేటాయించనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


