అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రంన్యూస్ జూన్ 29 : అరకు వ్యాలీ మండలం చోంపి గ్రామ పరిధిలోని రైల్వే గేట్ నుండి కొత్తవలస పారం సీసీ రోడ్ వరకు బ్రిడ్జ్ నిర్మాణ పనుల నేపథ్యంలో, ఈ మార్గాన్ని జూన్ 29 నుండి జూలై 8 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు చోంపి పంచాయతీ సర్పంచ్ కురుడ బోయిన సుభద్ర తెలియజేశారు.
ఈ నేపథ్యంలో చోంపి, సిరాగం, బస్కి పంచాయతీలకు చెందిన ప్రజలు, వాహనదారులు, అధికారులతో పాటు పర్యాటకులు, ప్రతినిత్యం ప్రయాణించేవారు బోసు బెడ్డ మెయిన్ రోడ్ ద్వారా మాడగడ వైపు మార్గం మళ్లించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రజలు అనవసరంగా మూసివేసిన మార్గంలో ప్రయాణించకుండా, మార్గం మళ్లించబడిన దారిలోనే జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ముఖ్యంగా వాహనదారులు ప్రమాదాలను నివారించేందుకు అధిక వేగంతో ప్రయాణించకుండా, తగిన భద్రతా చర్యలు పాటించాలని కోరారు.
ఇందులో భాగంగా ప్రజలు తమ ఆరోగ్య సేవల నిమిత్తం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి తగిన సూచనలతో సహకరించాలని సర్పంచ్ కురుడ బోయిన సుభద్ర, పంచాయతీ కార్యదర్శి ఉమార్ ఫరుక్ మరియు రోడ్డు సైట్ ఇంచార్జ్ తేజ సంయుక్తంగా ప్రకటించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనీ, కొద్ది రోజుల అసౌకర్యాన్ని సహించగలిగితే భవిష్యత్తులో మంచి రహదారి సౌకర్యం లభిస్తుందనీ వారు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


