-అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
-మీ ఉడుత ఊపులకు,అక్రమ అరెస్ట్ లకు, మీ తాటాకు చప్పుళ్లకు అస్సలే బయపడేదే లేదు
-బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ జూన్29 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ……. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.మీ ఉడుత ఊపులకు,అక్రమ అరెస్ట్ లకు, మీ తాటాకు చప్పుళ్లకు అస్సలే బయపడేదే లేదు అని ఆయన అన్నారు.మహా టీవీ చిన్న గ్లాస్ పగులుతేనే బాధడుతున్నారు
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్‌పై అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.ఇక్కడ రేవంత్ రెడ్డి,అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారు అని ఆయన తెలిపారు.మహా టీవీ యాజమాన్యం కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసింది అని ఆయన తెలిపారు.కేటీఆర్ తో పాటు వారి కుటుంబసభ్యుల పరువు తీసే విధంగా ప్రసారాలు చేశారు అని ఆయన అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


