అభివృద్ధితో కూడిన సంక్షేమమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం

TRINETHRAM NEWSఅభివృద్ధితో కూడిన సంక్షేమమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల..

TRINETHRAM NEWS

అభివృద్ధితో కూడిన సంక్షేమమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల టౌన్ 12వ వార్డు మరియు బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు.

ఈ సందర్బంగా నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ…

భవిష్యత్తు గ్యారెంటీ ఇది బాబు ష్యురిటి అంటూ ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేస్తూ.ఈ 2024 కొత్త సంవత్సరంలో తెలుగుదేశం & జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరు పథకాల అమలు చేస్తామని ఆయన అన్నారు.

పూర్ టు రీచ్ పథకంతో పేదవారికి స్వయం ఉపాధిని కల్పించి ప్రతి పేదవాడిని ధనికుడిని చేస్తాం, ఉద్యోగం లేని యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారికి ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి కింద సాయం చేస్తాం అని అన్నారు.

త్రాగునీరు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు, వారి కష్టాలు తీర్చాలని తెలుగుదేశం పార్టీ సంకల్పించింది, 2024 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇంటింటికి త్రాగునీటి కులాయి ని ఏర్పాటు చేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళలకు పెద్దపీట వేస్తుంది, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళ మనులకు అండగా నిలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది.
అదేవిధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహా శక్తి పథకం ద్వారా అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.
అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో 15,000 ఏడాదికి అందజేస్తామన్నారు.
ప్రతి ఆడబిడ్డ కి తోడుగా ఉండాలన్న తెలుగుదేశం పార్టీ సంకల్పంతో 18 సంవత్సరలు నిండిన ప్రతి ఆడబిడ్డ కి నెలకు 1500 రూపాయల సాయం చేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ధితో కూడిన సంక్షేమన్ని అందిస్తుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని, అయన ఈ సందర్భంగా అన్నారు…

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page