జూన్ 26, 2026

IMG 20240917 WA0008

TRINETHRAM NEWS

Telangana Public Governance Day

వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో, మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఆవిష్కరించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, సామాన్య ప్రజలకు అభివృద్ధి పలాలు అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముందుకు వెళ్తుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా, వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించి… వికారాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన గురించి తమ అమూల్యమైన సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ గార్లతో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Public Governance Day

You cannot copy content of this page