ఇందిరాపార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయం మూసివేత..
బంజారాహిల్స్‌లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీస్
Trinethram News : ఇందిరా పార్కు వద్ద గల తన పాత కార్యాలయాన్ని మూసివేసి లోని తన ఇంటి సమీపంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి, కొత్త కార్యాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్లు అయిందని కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి పుట్టిందని, యూఎస్ నుంచి వచ్చాక జయశంకర్ మాకు మార్గదర్శనం చేశారని, ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా..
ఏదో గ్యాప్ ఉందని జయశంకర్ చెప్పారని ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలని జయశంకర్ నాకు సూచించారని కవిత అన్నారు. మన ఖర్మేందంటే.. ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అనరు.. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు రేవంత్‌రెడ్డి నివాళులర్పించాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ యువ వికాసం అనే పేరుతో కార్యక్రమాలు ఉండాలి.. కానీ రాజీవ్ యువ వికాసంతో ఉండకూడదని ప్రభుత్వాన్ని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


