Kothapally Jayashankar : తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయంతి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)ఆగస్టు 06, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, తహసిల్దార్ కార్యాలయములో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి పురస్కరించుకొని ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని,తెలంగాణ సిద్ధాంత కర్త అని,తెలంగాణా ఉద్యమములో చురుకైనా పాత్ర పోషించిన మహోన్నత అంటరానితనం సామాజిక వివక్షకు దర్శకుడు మరియు అన్ని వర్గాలకు సమానవాట కోసం సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ఆయన అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సిబ్బంది, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. పి వెంకన్న మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందం, జూనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్,వివిధ గ్రామ పంచాయతి కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నీకల్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంటెంట్ అసిస్టెంట్ పొలం సురేష్ శివాజీ, అజయ్, వెంకటయ్య, రామస్వామి, మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kothapally Jayashankar's birth anniversary

You cannot copy content of this page

Scroll to Top