కూకట్పల్లి సెప్టెంబర్ 30 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గంలోని సీనియర్ జర్నలిస్ట్ నిలువుటద్దం దినపత్రిక ఎడిటర్ నాగరాజు అనారోగ్యంతో మృతి చెందడంతో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మంత్రి సీతక్క చేతుల మీదుగా ఒక లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సహాయం రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కార్యదర్శి ఎన్ వి రావు, కమిషనర్ ప్రియాంక, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


