*ఘనంగా స్వాగతం పలికిన ఏపీ రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్
*అంగరంగ వైభవంగా జరిగిన సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు
*ఎంతో మంది జీవితాల్లో సత్యసాయి బాబా వెలుగులు నింపారన్న సీఎం రేవంత్ రెడ్డి
మహీపాల్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి, నవంబర్ 23
Trinethram News : భగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానం అందుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికి… శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి…బాబా సేవా ధర్మాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా… సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…సత్యసాయి మానవ రూపంలో జన్మించిన మహనీయుడని… ఆయన సేవా మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టపర్తిలో జన్మించడం… తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సీఎంగా బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని…బాబా మనుషుల్లో దేవుడిని చూశారని ప్రేమతో అందరి మనసులను గెలుచుకుని… చిరస్మరనీయుడిగా నిలిచారని రేవంత్ తెలిపారు. ఉన్నతమైన చదువులతోనే జీవితాల్లో మార్పు వస్తుందని బాబా బలంగా నమ్మారని… అందుకే కేజీ నుంచి పీజీ వరxకు ఉచిత విద్యను అందించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
ఈ సందర్భంగా ఏపీ రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగుతూ… అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్య సాయి బాబా కోరుకున్న మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


