WhatsApp Image 2024 02 04 at 8.42.12 AM
Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది..
ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్‌ల కోసం అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంచుకోవాలి? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో రెండు హామీలకు ఆమోదం లభిస్తుందా.. లేక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. టీఎస్ బదులు టీజీ నంబర్ ప్లేట్లను మార్చే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశానికి దాదాపు 20 నుంచి 25 అంశాలతో ఎజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యదర్శులను ఆదేశించారు..
