Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు..
జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాడిపత్రి మున్సిపాలిటీలో సరఫరా అయ్యే తాగునీటి పైపులైను పాడైపోవడంతో రిపేర్ చేయడానికి టిడిపి, వైయస్సార్ సిపి నాయకులు పోటీపడ్డారు. రెండు రోజుల నుంచి పెన్నా నదిలో తాడిపత్రి మున్సిపాలిటీకి సరఫరా అయ్యే అరవింద వాటర్ వర్క్స్ పైపులైన్ రిపేరీ పనులు జరుగుతున్నాయి..
మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పెన్నా నది వద్దకు వెళ్లి రిపేరు తానే చేస్తున్నానని ప్రకటిస్తుండడంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి పెన్నా నది లో పైపులు రిపేర్ చేస్తున్న సంఘ స్థలానికి వెళ్లారు. ఇరువర్గాలు ఈలలు కేకలు వేయడంతో తాడిపత్రి డిఎస్పి గంగయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సర్దిచెప్పి పెన్నా నది నుంచి పంపించి వేశారు..