Madhavi provided Financial Assistance : ఇడ్లీ శ్రీనయ్య,కు ఆర్థిక సహాయం అందించిన టిడిపి మహిళా నాయకురాలు ,కంచర్ల మాధవి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: నవంబర్ 20 నెల్లూరు జిల్లా: నాగులవారం. నెల్లూరు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఇండ్ల శ్రీనయ్య కు ఆర్థిక సాయం అందజేసిన టిడిపి మహిళ నాయకురాలు కంచర్ల మాధవి.
బోగోలు మండలం నాగులవరం పంచాయతీ చెన్నారెడ్డి పాలెం గిరిజన కాలనీకి చెందిన ఇండ్ల శ్రీనయ్య కు కాలు విరిగి ఇన్ఫెక్షన్ సోకడంతో నెల్లూరు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.రోజుకు మూడు ఇంజెక్షన్ లు వేయవలసి ఉందనీ ఒక్కో ఇంజెక్షన్ ధర సుమారు 500 రూపాయలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కంచర్ల మాధవి గురువారం ఉదయం వైద్య శాలకు వెళ్లి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.వారి ఆర్ధిక పరిస్థితులను గమనించి నాగులవరం పంచాయతీ టీడీపీ నాయకురాలు కంచర్ల మాధవి తన వంతు సహాయంగా పది వేల రూపాయలు నగదును వైద్య ఖర్చు అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kancharla Madhavi provided financial assistance

You cannot copy content of this page

Scroll to Top