WhatsApp Image 2024 06 18 at 17.18.05
TDP ranks burned effigy in mine
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖనిలో చిన్నారిపై అఘాయిత్యం చేసి.. హత్య చేసిన నిందితుడి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో పనిచేసే ఒక మహిళ కార్మికురాలి ఆరు సంవత్సరాల కూతురిని ఒక కిరాతకుడు దారుణంగా మానభంగం చేయటమే కాకుండా ఆమెని గొంతు నులిమి ప్రాణం తీసినటువంటి నరహంత కుడికి ఉరిశిక్ష విధించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను కోరారు.
కే నిమ్మకాయలు ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, చిటికెల రాజలింగం సింగరేణి కాలరిస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్, నరెడ్డి స్వరాజ్యం రాష్ట్ర మహిళా కార్యదర్శి, బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి, రామగిరి రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రెటరీ, సుందిళ్ల స్వామి తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ టౌన్ కార్యదర్శి తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
