TDP Leader Murder : ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

TRINETHRAM NEWS

Trinethram News : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒంగోలులోని పద్మ టవర్స్ లో తన ఆఫీస్ లో వీరయ్య చౌదరి ఉండగా ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని ఆఫీసులోకి చొరబడ్డారు.

అనంతరం వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు గమనించి వీరయ్యను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు.

టీడీపీ నేత హత్యపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య చౌదరి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్‌ కి తరలించారు. టీడీపీ నేత హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP leader brutally murdered

You cannot copy content of this page

Scroll to Top