జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 21 at 09.37.05

TRINETHRAM NEWS

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.

ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఈ రోజు లేదా రేపు ఏ క్షణమైనా అభ్యర్ధులను ప్రకటించాక ఈ నెల 23న విజయవాడలో మొత్తం 144 అసెంబ్లీ అభ్యర్దులు,17 పార్లమెంట్ అభ్యర్దులతో టీడీపీ పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తుంది.

ఈ వర్క్ షాప్ లో ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్ధులకు అవగాహన కల్పిస్తారు.

విజయవాడ లోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ టీడీపి పార్టీ వర్క్ షాప్ కార్యక్రమానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై నేతలకు కొన్ని ముఖ్య సూచనలు చేసి రానున్న 55 రోజుల్లో పార్టీ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారు.

You cannot copy content of this page