‘Dial Your SP’ : ఎస్పీతో నేరుగా మాట్లాడండి! ‘డైల్ యువర్ ఎస్పీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో, జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ‘డైల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి రోజే ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుండి మొత్తం 26 కాల్స్ వచ్చాయి.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు, మాడిఫైడ్ సైలెన్సర్లతో కూడిన వాహనాల ద్వారా ఇబ్బందులు,అక్రమ ఇసుక రవాణా, అక్రమ ఎర్రమట్టి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులు. భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యక్తిగత సమస్యలు, పొలాలలోకి అక్రమంగా ప్రవేశించడం, మండల కేంద్రాలలో ట్రాఫిక్ సమస్యలు మొదలగు అంశాలపై ఫిర్యాదులునమోదయ్యాయి.”ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి సుదూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, ఫోన్ ద్వారానే అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది,” అని తెలిపారు.
ప్రతి సోమవారం, ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకు జిల్లా ఎస్పీ స్వయంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారు. జిల్లా ఎస్పీని సంప్రదించడానికి 08416 255601 నెంబర్ కు సంప్రదించాలని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇట్టి విషయాలపైనా తక్షణమే చర్యలు తీసుకొని, ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'Dial Your SP'

You cannot copy content of this page

Scroll to Top