Medical Camps : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో పిజేర్ నగర్ యువశక్తి మహిళా మండలి హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ వారికి మందులు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. వైద్య శిబిరం నిర్వహించిన మహిళా మండలికి, హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, పాండుగౌడ్, జి.రవి, పోశెట్టిగౌడ్, మహిళా మండలి అధ్యక్షురాలు డి.గణిత, హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ఫణి కుమార్, జోహార్ సింగ్, రవి, మాధురి, సరిత, వాసంతి, ధనలక్ష్మి, షామిలి, నాగమణి, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

medical camps

You cannot copy content of this page

Scroll to Top