Madhavaram Roja Devi : ఘనంగా కార్పొరేటర్ మాధవరం రోజా దేవి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

అనాధ చిన్నారులకు ఫ్యాన్ లు విరాళంగా అందించిన కార్పొరేటర్.

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 7 : వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో నాయ శ్రీ ఫౌండేషన్ అనాధ చిన్నారులు, స్థానిక నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఆమె కేకు కట్ చేశారు. అనంతరం నాయశ్రీ ఫౌండేషన్ చిన్నారులకు ఫ్యాన్లను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నయస్రీ ఫౌండేషన్ అనాధ చిన్నారులతో తన జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫౌండేషన్ వారు అనాధ పిల్లలను చేరదీసి దాతల సహకారంతో చిన్నారులను స్కూల్లో చేర్పించి చదివించి సొంత కుటుంబ సభ్యుల లాగా చిన్నారులను చూసుకుంటున్నందుకు వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు ఫ్యాన్లు అవసరం ఉన్నాయని తెలపడంతో వారికి ఫ్యాన్లను విరాళంగా అందజేసినట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madhavaram Roja Devi birthday

You cannot copy content of this page

Scroll to Top