త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం లోని ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా పెనుమూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్ పాల్గొన్నారు. ఆరు మండలాల అధ్యక్షులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పాలసముద్రం మండలానికి శివ నాయుడు, వెదురుకుప్పం మండలం మోహన్ మురళి, పెనుమూరు మండలం పెద్దినేని రుద్రయ్య నాయుడు, గంగాధర్ నెల్లూరు మండలం స్వామి దాస్, కార్వేటినగరం మండలం చంగల్రా యాదవ్, ఎస్ఆర్ పురం మండలం జయశంకర్ నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అలాగే క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల కన్వీనర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పెనుమూరు మండల అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు రికార్డ్ స్థాయిలో 15వసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించారు. అలాగే సి ఎస్ అగ్రహారం తెలుగుదేశం యూత్ కమిటీ ఎమ్మెల్యేను దుస్సాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గుర్రప్ప నాయుడు, తలారి రెడ్డప్ప, శ్రీనివాస్ చౌదరి, యాగమనాయుడు, దూర్వాసులు, రామచంద్ర రెడ్డి మరియు కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


