Swarnandhra Voluntary Program : రామకృష్ణాపురం పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. రామకృష్ణాపురం పంచాయతీ కృష్ణ యానాది కాలనీలో కలెక్టరు మరియు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వెనుకబడిన షెడ్యూల్ తెగల ప్రజల సమాచారాన్ని ప్రతి ఇంటికి వెళ్లి సేకరించడం జరిగింది. వ్యక్తిగత మరియు సామాజిక అవసరాలను గుర్తించడం కోసం సర్వే చేయడం జరిగింది. ఈ మేరకు కృష్ణ యానాది కాలనీలో రేషన్ కార్డులు ఆధార్ కార్డులు, జనన,మరణ,సర్టిఫికెట్లు కరెంట్ కనెక్షన్లు, మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించడం జరిగింది. అలాగే స్మశానం సరిహద్దులను సరి చేయడం, త్రాగునీటి సౌకర్యం కోసం కావాల్సిన వనరులను గుర్తించేదుకు తాసిల్దార్, ఎంపీడీవో కలిసి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. అలాగే దారి సౌకర్యం కోసం దారిని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ దాము, ఏపీఓ గుణశేఖర్, గ్రామ సర్పంచ్ దూది వెంకటేష్, తెలుగుదేశం నాయకుడు గుర్రప్ప నాయుడు, పంచాయతీ కార్యదర్శి హబీబ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swarnandhra voluntary program

You cannot copy content of this page

Scroll to Top