MLA KP Vivekananda : టీఎస్ఐఐసి కాలనీలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు…ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 129 – సూరారం డివిజన్ టీఎస్ఐఐసి కాలనీలోని చిల్డ్రన్స్ పార్క్ నందు నిర్వహించిన స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. బలమే జీవనము, బలహీనతే మరణము అనే స్ఫూర్తిదాయక వ్యాఖ్యాలతో దేశ యువతకు ప్రేరణనందించిన గొప్ప సంఘ సంస్కర్త స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర్ రావు, టీఎస్ఐఐసీ కాలనీ అధ్యక్షులు నేతి రాజు, సీనియర్ సిటిజన్స్ సాయిబాబా, కాలనీ వాసులు చెక్క సురేష్, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swami Vivekananda's 163rd birth anniversary celebrations in TSIIC

You cannot copy content of this page

Scroll to Top