దేవరకొండ డివిజన్ జనవరి 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టీ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఒక మార్గదర్శి అని, స్వామి వివేకానంద (జననం: 1863 జనవరి 12, కలకత్తా; మరణం: 1902 జూలై 4) చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా ఆయన ప్రముఖ హిందూ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు, మరియు దేశభక్తుడు, రామకృష్ణ పరమహంస శిష్యుడు, వేదాంత, యోగా తత్వాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు, చికాగో సర్వమత సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది రామకృష్ణ మఠం మిషన్ స్థాపించారు.
ప్రతి ఆత్మలో దైవత్వం ఉందని దానిని మేల్కొలపడమే జీవిత లక్ష్యమని బోధించారు. మానవసేవయే దైవసేవ అని నమ్మేవారు. భారతదేశపు గొప్ప ఆధునిక ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించబడ్డారు, అనిఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, చంద్రశేఖర్, బొడిగ వెంకటేష్, చిన్నోడు, మోసిన్, శరత్, రమేష్, సాబేరు, సురేష్, రమేష్, రాము, రంగయ్య, మోహన్ బాబు, పుల్కేష్, సందీప్, అజయ్, భరత్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


