దేవరకొండ మే 08 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని విష్ణు కాంప్లెక్స్ మిర్యాలగూడ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన MMR డయాగ్నొస్టిక్ & క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, MMR డయాగ్నొస్టిక్ & క్లినిక్ ను నల్గొండ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .
అనంతరం ఎమ్మెల్యే ని క్లినిక్ యాజమాన్యం వారు శాలువాతో సత్కరించారు. వైద్యశాలలో అందించే సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకొని,మంచి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం పలు వివాహా శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి,మాజీ ఎంపీపీలు దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి,మేకల శ్రీనివాస్ యాదవ్,గోవింద్ యాదవ్, జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, నేరేడుగొమ్ము మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని కృష్ణయ్య,సీనియర్ నాయకులు తిపార్థి రుక్మా రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, PACs చైర్మన్లు,గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


