జూన్ 26, 2026

Death

TRINETHRAM NEWS

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Trinethram News : ఫిలిప్పీన్స్‌ : ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నిగ్ధ (17)

పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె చింత స్నిగ్ధ (17) ఫిలిప్పీన్స్ దేశంలోని పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అయితే స్నిగ్ధ పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతిచెందినట్లు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్నిగ్ధ చనిపోయినట్లు అక్కడ తోటి విద్యార్థినిలు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

విద్యార్థిని మృతి వార్తతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page