
బలభద్రపురంలో భూగర్భ వారాహి మాత ఆలయ ప్రారంభోత్సవం
Suryanarayana Reddy : త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో తోటలో మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ వారాహి మాత ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన సూర్యనారాయణ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంపై సూర్యనారాయణ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ, భూగర్భంలో నిర్మించిన ఈ వారాహి మాత ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఆలయం కాశీ వారాహి మాత ఆలయంలా ప్రసిద్ధి గాంచడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన గ్రామ ప్రజలను మరియు ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.

