TRINETHRAM NEWS

వేదాలు, పురాణ ఇతిహాసాలను లా కాలేజీలో పాఠ్యాంశాలుగా చేర్చాలి

Trinethram News : న్యూఢిల్లీ : వేదాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో ఉన్న న్యాయతత్వాన్ని లా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్ అన్నారు. న్యాయం, సమానత్వం భావనలను విద్యార్థులకు పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చుకున్న విషయాలుగా కాకుండా భారతదేశ ప్రాచీన చట్టపరమైన తార్కిక విధానాలలో పొందుపరిచిన ఆలోచనలుగా బోధించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 75 వసంతాలను పురస్కరించుకుని ఏప్రిల్ 12న భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నిర్వహించిన సమావేశంలో పంకజ్ మిట్టల్ పలు అంశాలు ప్రస్తావించారు.

పురాతన భారతీయ చట్టపరమైన, తాత్విక సంప్రదాయాలను లా కాలేజీలు పాఠ్యాంశాల్లో అధికారికంగా చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. వేదాలు, స్మృతులు, మనుస్మృతి, ధర్మాలు, అర్థశాస్త్రం, మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు కేవలం సాంస్కృతిక కళాఖండాలు కాదు. వాటిలో న్యాయం, సమానత్వం, శిక్షలు, పరిపాలన, రాజీ కుదుర్చడం, నైతికత లాంటి లోతైన విషయాలను ప్రతిబింబిస్తున్నాయి. వాటిని తెలుసుకోవాలనుకుంటే ముందుగా చదవాలని’ అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసుకువస్తే దేశ న్యాయ వ్యవస్థను బాగా అర్థమవుతుంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జడ్జి మిట్టల్ అన్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో కొంతకాలం కిందట చీర ధరించి, కత్తికి బదులుగా పుస్తకం పట్టుకుని, కళ్లకు గంతలు తొలగించి ఉన్న న్యాయదేవత కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆ పుస్తకం రాజ్యాంగం అని, కానీ నాలుగు పుస్తకాలు ఉండాలని తాను నమ్ముతున్నానని జస్టిస్ మిట్టల్ అన్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజలకు భగవద్గీత, వేదాలు, పురాణాలు లాంటి పుస్తకాలు ఉండాలి. దాంతో న్యాయవ్యవస్థ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. లా కాలేజీలు, యూనివర్సిటీలు ధర్మం – భారతీయ న్యాయ ఆలోచన, లేదా భారతీయ న్యాయ శాస్త్ర మూలాలు అనే శీర్షిక ఉండాలని ఆయన ప్రతిపాదించారు. దాంతో విద్యార్థులకు సాంస్కృతిక, మేధోపరమైన పునాదిని ఆ పాఠ్యాంశాల ద్వారా పటిష్టం అవుతాయి.

ఆర్టికల్ 14ను సమానత్వం కోసం అరువు తెచ్చుకున్న విషయంగా కాకుండా సమానత్వం స్వరూపంగా అర్థం చేసుకోవాలి. పర్యావరణ చట్టాన్ని చట్టాల ద్వారా మాత్రమే కాకుండా వేదాలలో ప్రకృతిని గౌరవించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని (ADR) శాస్త్రాలు, మనుస్మృతిలో ఉన్న విషయాల కొనసాగింపుగా అర్థం చేసుకుంటారు. రాజ్యాంగం అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సూత్రాలు, అంశాలు కాదు అని.. భారత్‌లో పురాతన కాలంలో పాటించిన న్యాయ విధానాలుగా అర్థం చేసుకోవాలన్నారు. చట్టాలు కొన్నేళ్ల కిందట, 1950లో పుట్టినవి కాదు, మన దేశంలో రామాయణం, మహాభారతం కాలంలోనే న్యాయ విధానాలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు పేర్కొనే ధర్మం ఉన్న చోట విజయం తధ్యమని అనేది మహాభారతం నుంచి తీసుకున్నారు. మన నాగరికతలో న్యాయం అనేది ధర్మం యొక్క స్వరూపం. నైతికత, సామాజిక బాధ్యత, అధికారాన్ని సరిగ్గా వినియోగించడం మూల సూత్రాలు. పర్యావరణ పరిరక్షణకు సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను ప్రస్తావించారు. అధర్వణవేదం మానవాళిని ఆకాశం, భూమి, గాలి, నీళ్లు, అడవికి హాని కలిగించవద్దని సూచించిందని జడ్జి మిట్టల్ అన్నారు. సమానత్వ సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఋగ్వేదంలో ఉందన్నారు. అందరూ ఒకే మార్గంలో నడుస్తుంటే హెచ్చుతగ్గులు ఉండవని పేర్కొన్నారు. ధర్మం, నీతి, న్యాయాలకు పురాణ ఇతిహాసాలు మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court judge's key