Mini Mahanadu : విజయవంతం అయిన మీని మహానాడు

TRINETHRAM NEWS

తేది : 18/05/2025. ఏలూరు జిల్లా:( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చింతలపూడి,నియోజకవర్గం ,లింగపాలెం మండలం, వేబ్రిడ్జి దగ్గర టిడిపి మిని మహానాడు కార్యక్రమాన్ని ఘ ణంగా నిర్వహించడం జరిగింది.నాలుగు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే , సొంగా రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. ప్రభాకర్. ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్టా.

మహేష్ కుమార్ యాదవ్ రాష్ట్రం మరియు జిల్లా, నియోజకవర్గం, మండలం అధ్యక్షులు మరియు నాయకులు కూటమీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సమస్యలకు పరిష్కారాలు, సంబంధిత ప్రాజెక్టు వివరాలు , తదితర సమస్యలకు పరిష్కారాలు చేసినటువంటి వాటిని తెలిపారు. ప్రజలే దేవుళ్ళు కార్యకర్తలే బలం అని , మీరు లేకపోతే మేము లేము అంటూ వివరించారు. రైల్వే ప్రాజెక్టు గురించి వివరించారు మీకు సమస్య వస్తే మాకు వచ్చినట్టేనని అన్నారు.
మినీ మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తలకు మరియు ప్రజలకు, అభిమానులకు ఎవరికి ఎటువంటి లోటుపాట్లు, లేకుండా , రాకుండా చూసుకున్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా విజయవంతం చేసినారు. ఎమ్మెల్యే ఎంపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు పలకడం జరిగింది.
ఉమ్మడి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు అని అన్నారు. క్షేమంగా ఇంటికి వెళ్ళమని కార్యకర్తలకు చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంపీ చేస్తున్నటువంటి ప్రజా సమస్యలకు పరిష్కారాలు ను ప్రజలు అభినందిస్తున్నారు. అభివృద్ధికి మారుపేరు అని డైనమిక్ ఎమ్మెల్యే , ఎంపీ అని ప్రజలు పొగుడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆరాధిస్తున్నారని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Successful Mini Mahanadu

You cannot copy content of this page

Scroll to Top