స్థానిక మహిళల కొత్త బ్రాండ్
మార్కెటింగ్ దిశలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు
త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 10
కడియం
హార్టికల్చర్ వ్యర్థ పూలతో మహిళలు అగరబత్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అభినందించారు. మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆదాయ వనరులను సృష్టించడం ప్రశంసనీయం అన్నారు. కడియం ప్రాంతంలోని వ్యర్థ పూలతో అగరబత్తుల తయారీ యూనిట్ మరియు కొబ్బరి తాళ్ళ తయారీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. శిక్షణ పొందిన మహిళలతో సమావేశమై, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే రంగంలో మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ డిమాండ్‌కు అనుగుణంగా యూనిట్ స్థాపన ఉండాలి. భవిష్యత్తులో ఏర్పాటు చేసే యూనిట్ల విషయంలో ముడి సరుకు లభ్యత నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఆమేరకు ఖచ్చితత్వం ఉండేలా ప్రతిపాదనలు, సిద్ధం చేయాలి, అనిఅధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ఆవిష్కరణలు సదా ఆహ్వానం అన్నారు . వాటి విజయానికి తగిన మార్కెటింగ్ సహకారం కీలకమనీ , మహిళల చొరవతో ‘కడియం నాచురల్ అగరబత్తులు’ అనే ప్రత్యేక బ్రాండ్ రూపుదిద్దు కోవడం గర్వకారణం,” అని కలెక్టర్ అభినందించారు. కెనరా బ్యాంక్ సహకారంతో తొలి దశలో 12 మంది మహిళలు యూనిట్ స్థాపనకు ముందుకు రావడం ప్రశంసనీయం అని తెలిపారు. మొత్తం 52 మంది మహిళలు శిక్షణ పొందగా, మరిన్ని మహిళలు కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగు బంటి సత్య ప్రసాద్, డీఆర్డిఏ పీడీ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, జిల్లా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అధికారి కే. శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లిఖార్జున రావు, తహసిల్దార్ ఎమ్. సునీల్ కుమార్, ఎంపీడీవో కె. రమేష్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


