SP Rohit Raju IPS : సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం త్రినేత్రం న్యూస్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కొరకు నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ వాహనదారులకు అవగాహన కల్పించాలి

జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు అధికారులతో సమావేశమయ్యారు.ముందుగా గత నెలలో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలని సూచించారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.

రాబోయే నెలలో జరగనున్న భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని ట్వలిపారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ సీఐ నాగరాజు రెడ్డి మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Strict action should

You cannot copy content of this page

Scroll to Top