G. Bhanumati : అనాధ శరణాలయం ను అకస్మాతిక తనిఖీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

పిల్లల అనాధ శరణాలయాన్ని అకస్మాతిక తనిఖీ నిర్వహించిన
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి

వినాయకపురం, అశ్వారావుపేట మండలంలో ఉన్న అనాధ పిల్లల ఆశ్రమాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి సందర్శించారు. ఈ సందర్భంగ న్యాయమూర్తి పిల్లలకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆశ్రమ నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాల వలన సంరక్షణ కష్టంగా ఉండడం వలన వచ్చిన అనాధ పిల్లలకు ఆహారం తదితర అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగ తెలిపారు.

న్యాయమూర్తి అనాధ శరణాలయం ఆవరణ, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. అనాధ శరణాలయంను సజావుగా నిర్వహించాలని అన్నారు. రిజిస్టర్స్ సరిగా ఉండకపోవడం ఆశ్రమం పరిసరాలు సౌచాలయాలు సరిగా లేకపోవడం పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, ధనుష్కోటి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A surprise visit to

You cannot copy content of this page

Scroll to Top