
డిండి మండల వ్యవసాయ అధికారి (ఎం ఎ ఓ.) రెహానా….
Strict Action : డిండి (గుండ్ల పల్లి) జూన్ 08, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లాడిండి మండల కేంద్రంలో ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారి (MAO), రెహానా మండల రెవెన్యూ అధికారి (MRO) శ్రీనివాస్ గౌడ్ మరియు స్థానిక ఎస్‌ఐ . సీ హెచ్ బాలకృష్ణ సంయుక్తంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయ కేంద్రాలను Annadata Traders, ARSK Dindi లను సోమవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణాలలో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్ బుక్స్, విక్రయ రికార్డులు పరిశీలించి నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన లేదా నాణ్యతలేని ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలని డీలర్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ధృవీకరించబడిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తన ప్యాకెట్లపై ఉన్న బ్యాచ్ నంబర్, గడువు తేదీ మరియు నాణ్యత వివరాలను పరిశీలించాలని తెలిపారు.
అలాగే ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఒకటి లేదా రెండు వర్షాలకు తొందరపడి విత్తనాలు విత్తకుండా, భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తుకోవాలని సూచించారు. సరిపడా తేమ లేకుండా విత్తడం వల్ల మొలకలు దెబ్బతిని దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe