
డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి డివిజన్ స్థాయి అధికారులందరు తప్పనిసరిగా హాజరుకావాలి.
సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు-జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరిక.
Prajavani : దేవరకొండ డివిజన్ జూన్ 08, త్రినేత్రం న్యూస్. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వినూత్నంగా ఆలోచించారు .సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.అయితే క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 30 న, జి ఓ 3 ద్వారా డివిజన్ స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో మాదిరిగానే తప్పనిసరిగా ప్రజావాణిని నిర్వహించాలని ఆదేశించింది.
ఈ మేరకు నల్గొండ జిల్లాలోని నల్గొండ,దేవరకొండ,మిర్యాలగూడ,చండూరు డివిజన్లలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe