Mon. Mar 9th, 2026

Agriculture Officer : యూరియాకు అదనపు వ్యయం అను ప్రచురణ పై వివరణ ..ఏ వో

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జిడి నెల్లూరు నియోజకవర్గం. మండల వ్యవసాయ అధికారిని పెనుమూరు మండలం కే. సుహార్ లత సవనీయంగా జిల్లా వ్యవసాయ అధికారి వారికి విన్నవించుట ఏమనగా ఈరోజు అనగా తేదీ 14-2-2026 దినపత్రికలో యూరియా ఆదనపు వ్యయం అను ప్రతికూల శీర్షిక ప్రచురమైన విషయంగా మీకు విన్నవించుట గురించి
పెనుమూరు మండలంలో రబీ పంట కాలంలో మండలంలోని పంటల విస్తీర్ణం అనుసరించి అక్టోబర్ 2025 నుండి యూరియా పంపిణీలో ఆర్ఎస్కేలు లో గాని ప్రైవేట్ డీలర్లలో మరియు సొసైటీ పిఎసిఎస్ పెనుమూరు వద్ద ఎటువంటి సమస్యలకు తావు ఇవ్వకుండా పంపిణీ జరుగునట్లు పర్యవేక్షణ చేయుచున్నాను మరియు PACS పెనుమూరు వారికి 1-10-2025 నుండి 13-02-2026 వరకు 54 మెట్రిక్ టన్ లో (1200 బ్యాగులు) యూరియా అలాట్ చేయడం జరిగినది.
గౌరవనీయులు సింగల్ విండో చైర్మన్ ఆరోపించిన విధంగా మండలంలో ఎక్కడ సమస్య తలపెట్టే విధంగా యూరియా పంపిణీలో రైతుల వద్ద నుండి ఎటువంటి కంప్లైంట్ నా దృష్టికి రాలేదని మీకు విన్నవించుతున్నాను.
తదుపరి కూడా అన్ని ఆర్ఎస్కేలు ప్రైవేట్ డీలర్ల దగ్గర పూర్తిస్థాయిలో పర్యవేక్షించుటలో ఎటువంటి సమస్యలకు తావు లేకుండా పంపిణీ చేయు విధంగా చర్యలు చేపడతానని విన్నవించుకుంటున్నాను ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా పర్యవేక్షించుదని మీకు సవినియముగా తెలియజేయుచున్నాను..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

additional cost for urea

Related Post

You cannot copy content of this page