Strict Action : ఆదివాసి ప్రాంతాల్లో డ్రోన్లపై కఠిన చర్యలు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ నవంబర్ 4, (త్రినేత్రం న్యూస్): ఆదివాసి ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా డ్రోన్లు ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవని అరకు సీఐ హిమగిరి హెచ్చరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి డ్రోన్ సర్వే నిలిపివేయాలని ట్రైబుల్ వెల్ఫేర్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించగా, కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఆదివాసి నాయకులతో సమావేశమై సర్వే నిలిపివేశారు. గ్రామసభ, పీసా అనుమతి లేకుండా ప్రాజెక్టు ముందుకు సాగదని స్పష్టం చేశారు.
అయినా కొంతమంది తక్కువ ధరలకు మార్కెట్లో డ్రోన్లు లభ్యమవడంతో కొంతమంది సరదా కోసం లేదా రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వాటిని ఆదివాసి ప్రాంతాల్లో ఎగర వేస్తున్నారని పోలీసులు తెలిపారు. గిరిజనుల నుండి నిత్యం డ్రోన్ల పై ఫిర్యాదులు రావడంతో ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్టు సీఐ హిమగిరి వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action against drones in tribal areas

You cannot copy content of this page

Scroll to Top