రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపుసావరం గ్రామంలో ఈరోజు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు అధ్యక్షతన జరిగింది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు & వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు…
త్రినేత్రం న్యూస్. జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఎటు చూసినా చీకటి అలుముకుందని పేదవాడు ఉచితంగా చదువుకోడానికి చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు వేస్తుందని, పేద ప్రజలు ఉన్నత విద్య అభ్యసించాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుoదని, రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తివేసి పేదవాడి నడ్డి విరిచారని అలానే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి శాశ్వతంగా పేదవాడిని అనగదొక్కాలని చూస్తున్నారని, అన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్క నగేష్,గిరిజాల బాబు,మండల అధ్యక్షులు యాదాల స్టాలిన్,సాపిరెడ్డి కామేష్,పోరాటి శ్రీను,కొత్తపల్లి శివాజీ,ఉట్టికూటి శైలజ,గంగారామ్,చింతపర్తి రాంబాబు,చాప రాజా,ముద్దాల అను, ముత్యాల పోసికుమార్, డాక్టర్ చోల్లంగి సత్యగిరి,ఓడూరి రాంకీ,పరిమళ నాని, అరిగేల హరీష్,కట్టా జమిందర్,పితాని హరికృష్ణ,టికి శ్రీను,కోల్లి వెంకటరత్నం,పట్టా ఉత్రేజ్, కోల్లి నానీబాబు,తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


