ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, పాడేరు మండలంలో *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే *మత్స్యరాస విశ్వేశ్వర రాజు చేతుల మీదుగా ఎంపీ నిధులతో 26 పంచాయతీలకు స్ట్రీట్ లైట్లు పంపిణీ చేయటం జరిగింది.
పాడేరు మండలంలోని 26 పంచాయతీలకు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి MP నిధులతో స్ట్రీట్ లైట్లు ఇవ్వడం జరిగింది. పాడేరు ఎంపీడీవో ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు అరకు ఎంపీ హాజరై ఎంపీ నిధులతో 26 గ్రామ పంచాయతీలకు స్ట్రీట్ లైట్లు అందించడం చాలా శుభపరిణామం అని,ఎంపీ కి అభినందించడం జరిగింది, గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలందరూ అందుకోవాలని, దేశ అభివృద్ధికి గ్రామాలే ప్రధానమని కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపీడీవో,పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, 26 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


