తేదీ : 28/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, అమరవరం ఎస్సీ వసతి గృహాన్ని పున: ప్రారంభిస్తానని శాసనసభ్యులు చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థుల క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులను కలిసి వసతి గృహం యొక్క పరిస్థితిని వివరిస్తూ పందొమ్మిది వందల అరవై ఏడు వ సంవత్సరంలో ఎమ్మెల్సీ కీర్తిశేషులు తోటకూరి. వెంకటప్పయ్య సహకారంతో సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించి ,రెండు వేల పద్నాలుగు వ సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది. ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా చేసి ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడడానికి దోహద పడిందని, పూర్వ విద్యార్థులు రెంటాల. వెంకట్, చింతమల్ల. కాంతారావు, శనగ. వెంకటేశ్వర్లు తంబళ్ల. కన్నయ్య, శనగ. రామచంద్రరావు, బుయ్యన. నాగేశ్వరరావు, దా నియాల్ సంబంధిత వినత పత్రం అందజేశారు.
మళ్లీ వసతి గృహాన్ని పున: ప్రారంభించడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్సీ విద్యార్థులకే కాకుండా, ఎస్టీ ,బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ముప్పై నాలుగు గ్రామాలకు వసతి గృహం లేకపోవడం వల్ల వ్యవసాయం, కూలి పని చేసు కొని జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల పిల్లలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగలంతా పూర్వ విద్యార్థులుగా ఏర్పడి కృషి చేస్తున్న వాళ్లను డైనమిక్ శాసనసభ్యులు అభినందించారు. ఆయనకు మరియు కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


