Problem of Christians : క్రైస్తవుల సమస్య పరిష్కారానికి చర్యలు

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్

పెద్దపల్లి, ఆగస్టు -26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అదనపు కలెక్టర్ డి. వేణు తో కలిసి పాస్టర్లతో సమావేశం నిర్వహించారు క్రైస్తవుల సమస్యలను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు వినతులు అందించారు.

ఈ సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రైస్తవులకు ఎదురయ్యే క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ సమస్యలను పరిష్కరించాలని అన్నారు అంతకుముందు మదర్ థెరిసా జన్మదిన పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

resolve the problem of Christians

You cannot copy content of this page

Scroll to Top