మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని పట్టణంలోని రుషికా ఫంక్షన్ హల్ లో మంథని సి . ఐ రాజు గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏసీపీ మాట్లాడుతూ మండపం నిర్వాకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు.
వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్, విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని కోరారు.డీజే లకు అస్సలు అనుమతి లేదు . రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దన్నారు.మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలి.గణేష్ మండపాల వద్ద చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. వ్యక్తుల కదలికలు పోలీసులకు తెలియజేయాలి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని ఏసీపీ హెచ్చరించారు. గణపతి మండప నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని పోలీసు వారికి సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, ఎమ్మార్వో కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎస్ఐలు రమేష్, నరేష్ , మండప నిర్వహకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


