State IT Minister Duddila Sridhar Babu Raj Thakur visited Ellampalli project
వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రాజ్ ఠాకూర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని . అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు మంగళవారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ల తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు సామ్యర్థం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీరును పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేస్తూ , అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్ ఆర్ ఎస్ పి , కడెం ప్రాజెక్టుల నుండి పెద్దఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లి కి రావడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి విడుదల చేస నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు, ముంపు జరిగే అవకాశం లేదని, అయినప్పటికీ ఆకస్మికంగా భారీ వరదలు ఒకేసారి వచ్చే నేపథ్యంలో ఎటువంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు వరద వచ్చే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని , రెవెన్యూ పోలీస్ మున్సిపల్ , నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App