IMG 20240903 WA0008
Dasari Hari Chandana, Special Secretary of the Roads and Buildings Department, has directed the officials to speed up the work on the flyover bridge and complete the work in the district
వికారాబాద్, సెప్టెంబర్ 3:
మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపడుతున్న ఫ్లై ఓవర్ వే బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాల కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల పనులను వేగవంతం చేస్తూ మూడు మాసాలలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవలకు తావు నివ్వకుండా నాణ్యతను పాటించాలని అధికారులకు సూచించారు.
నిర్మాణాలు చేపడుతున్న పనుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆమె అధికారులు ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా కాలినడక బాటల నిర్మాణ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆమె తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిపై సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ముందుగా వికారాబాద్ పట్టణ కేంద్రంలో 96 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులను కలెక్టర్ తో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ సుధీర్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ ఈ వసంత నాయక్, ఇంచార్జ్ ఇఇ శ్రీధర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
