పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి – రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి, తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆశీషులు తీసుకొన్నరాష్ట్ర జి.సి.సి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్.
శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి వెంకటేశ్వరుని ఆశీర్వాదం తీసుకొన్నారు. అంతకముందు దేవస్థాన అదనపు ఈ. ఓ వెంకయ్య చౌదరి తో కలిసి,అరకు కాఫి ప్రమోట్ చేసే విదంగా సహాకరించాలని,జీసీసీ కాఫీ తో పాటు, జీసీసీ స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ, జీసీసీ అభివృద్ధి కీ సహకరించాలని, గిరిజనులకు ఎంప్లాయిమెంట్ తిరుమల లో ఇచ్చే విధంగా చూడాలని,పాడేరు ప్రాంతంలో తిరుమల దేవస్థానం నిర్మాణం జరగాలని, మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు ఎర్పాటు చైయాలని, ప్రజలు కోరుతున్నారని అనుమతి వచ్చే విధంగా చూడాలని అదనపు ఈ. ఓ. ను రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కోరారు. తప్పకుండా మీరు ఇచ్చే వినతులను పరిశీలించి చూస్తామని సానుకూలంగా స్పందించి అదనపు ఈ ఓ వెంకయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ వెంట టీడీపీ రాష్ట్ర ఎస్ టీ సెల్ ఆర్గనైజషన్ సెక్రటరీ సాగర సుబ్బారావు, బాకూరు సర్పంచ్ వెంకటరమణారాజు, దారేలా సర్పంచ్ పాంగి పాండురంగస్వామి,అనిల్,ఎస్ వి శ్రీనివాస్ చౌదరి, నాగ భూషణ్,ఐసిసి క్రికెట్ కోచ్ మోహన్ సుందర్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App