
State Cabinet : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 23 ; రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ బేటిలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్ లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత మంత్రివర్గం అంగీకరించారు.
రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. అయితే రాష్ట్ర రాజధాని అయిన అమరావతి పరిధిలోని గ్రామాల్లో రూపాయలు 1,548 కోట్లతో మౌలిక వసతుల పనులకు ఆ వర్గం ఆమోదం తెలిపింది. అమరావతి ఇన్ ప్రా పనులకు అదనంగా రూపాయలు 644. 98 కోట్లు .అసెంబ్లీ మరమ్మతులకు రూపాయలు 661 కోట్లు కేటాయించనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe